సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్ల విరాళ‌మిచ్చిన రిల‌య‌న్స్

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి రిలయన్స్ ఇండస్ట్రీస్ త‌న వంతు సాయం చేసింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) రూ .5 కోట్ల విరాళాన్ని అంద‌జేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) . జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే PM-CARES సహాయ నిధికి రూ. 530 కోట్లు అందించింది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5కోట్లు విరాళం అందించడంతో కేటీఆర్.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు చెప్పారు.

Latest Updates