పబ్‌జి ప్లేయర్స్ కు జియో బంపరాఫర్

reliance-jio-and-pubg-team-up-for-pubg-lite-in-india

రిలయన్స్ జియో కంపెనీ మోస్ట్ పాపులర్ ఆన్ లైన్ గేమ్ పబ్ జి తో చేయి కలిపింది. దేశంలో ఎక్కువ మంది యూజర్లకు తమ నెట్ వర్క్ చేరువయ్యేందుకు రిలయన్స్.. “పబ్ జీ లైట్” పేరుతో ఓ కొత్త యాప్ ను లాంచ్ చేస్తోంది.

జియో నెట్ వర్క్ వాడుతున్న యూజర్లు ఈ యాప్ లో రిజస్టర్ అయినట్లయితే వారికి రివార్డు పాయింట్లు లభిస్తాయి. దీంతో గేమ్‌లోని స్కిన్స్‌ను ఉచితంగా గెలుచుకోవచ్చు. పబ్‌జి లైట్ కోసం యూజర్లు https://gamesarena.jio.com వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత వారి ఈమెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. దీన్ని వెరిఫై చేసుకున్న  తర్వాత మరో మెయిల్ వస్తుంది. ఇందులో రిడెంప్షన్ కోడ్ ఉంటుంది. దీన్ని గేమ్‌లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇప్పటి వరకూ కంప్యూటర్లు, స్మార్ట్ మొబైల్స్ లోనే ఆడే ఈ గేమ్ ను తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ లలో కూడా  అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. తద్వారా కంపెనీ నెట్ వర్క్ పరిధిని పెంచుకోవాలని చూస్తోంది.