రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్ – బిగ్ బజార్’

రిటైల్ సెగ్మెంట్కు కొనే చాన్స్

తుదిదశకు చేరిన చర్చలు

న్యూఢిల్లీ: బిగ్‌ బజార్ వంటి సూపర్ మార్కె ట్లు నిర్వహించే ఫ్యూచర్ గ్రూపు రిటైల్ సెగ్మెంట్‌ ను

కొనేందుకు రిలయన్స్ తుది దశ చర్చలు జరుపుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఫ్యూచర్‌ గ్రూప్ రిటైల్ గ్రూపులో

షేరును దక్కిం చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ట్రాన్సా క్షన్‌ కు సంబంధించి గతంలో ఏర్పడ్డ

విభేదాలను ఇరు కంపెనీలూ పరిష్కరించుకున్నాయని తెలుస్తోంది. షేర్ల అమ్మకంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని రిలయన్స్ వర్గాలు తెలియజేశాయి. ఫ్యూచర్ రిటైల్‌ తోపాటు సప్లై చెయిన్, దీనికి సంబంధించి న ఇతర వ్యాపారాలనూ కొనేస్తారు. దీంతో ప్రస్తుత చీఫ్ కిషోర్ బియానీ ఫ్యూచర్ రిటైల్‌ పై పట్టు కోల్పోతారని చెప్పవచ్చు. డీల్ పూర్తయ్యాక బియానీ పాత్ర ఏంటనే విషయమై ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. రిలయన్స్ ఫ్యూచర్‌ లో మైనారిటీ వాటాలే కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, మేనేజ్‌ మెంట్ అంతా పాత వారి చేతుల్లోనే ఉండొచ్చని ఫ్యూచర్ గ్రూపు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.

వాల్యుయేషన్‌‌పై క్లారిటీ రాలే

మిగతా అన్ని విషయాల్లో విబేధాలను పరిష్కరించుకున్నా , ఫ్యూచర్ రిటైల్ వాల్యుయేషన్‌ పై ఒకేరకమైన అభిప్రాయానికి రావడం లేదు. మరోవైపు ఫ్యూచర్ గ్రూపు తన డాలర్ బాండ్ల వడ్డీ చెల్లిం పులో విఫలమయిం ది. చేతిలో తగినంత డబ్బులేక కంపెనీకి ఇబ్బందుల ఎదురవుతున్నాయి. దీం తో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఫ్యూచర్​ రేటింగ్స్‌‌ను తగ్గించింది. ఫ్యూచర్ రిటైల్లో ప్రమోటర్లకు 42% వాటా ఉంది. అయితే మొత్తం 75% వాటాలను కుదువబెట్టారు. రిలయన్స్‌‌తో డీల్​కు ఫ్యూచర్ గ్రూపు బోర్డు ఓకే చెప్పిందని విశ్వసనీయవర్గాలు తెలియజేశాయి. రాబోయే మరికొన్ని రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటిస్తారని వెల్లడిం చాయి. రిలయన్స్ కొనగా మిగిలిన ఎఫ్ఎంసీజీ, ఇతర బిజినెస్‌లు బియానీ దగ్గరే ఉంటాయి. షేర్ల బదిలీ, నగదు విధానంలో డీల్‌ ను పూర్తి చేశారు. ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌‌లు రెస్పాండ్ కాలేదు. ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్ సెగ్మెం ట్లో ఇండియాలోనే నెంబర్ టూ స్థానంలో ఉంది. అప్పులు పెరిగిపోవడంతో వాటాల అమ్మకానికి సిద్ధపడింది. లిస్టెడ్ కంపెనీల వాల్యుయేషన్ కూడా తగ్గింది. దీనికితోడు లాక్డౌన్ వల్ల రెవెన్యూలు విపరీతంగా తగ్గాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యూ 74% తగ్గి రూ.10,464 కోట్లకు పడిపోయింది. అప్పులు రూ.12 వేల కోట్లకు చేరాయి.

Latest Updates