పశ్చిమ బెంగాల్ లో ఆలయాలు తెరుచుకున్నాయి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆలయాలు తెరుకుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన దేవాలయాలు తెరుచుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దైవదర్శనం కోసం పోటెత్తారు. అయతే రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయమైన కాళీఘాట్ ఆలయం, కాథడ్రల్ చర్చిలను తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అన్ని దేవాలయాలతో పాటు కాళీఘాట్‌ గుడి కూడా తెరిచారనుకున్న భక్తులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయితే గుడి తలుపులు మూసి ఉండటంతో నిరాశ చెందారు.  బయటి నుంచే దేవుడ్ని మొక్కుకుని వెనుదిరిగారు భక్తులు.

Latest Updates