దేశానికి సుష్మా నిస్వార్థ సేవలందించారు: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఆమె సేవలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ ఫస్ట్‌ కేబినెట్‌లో సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో సుష్మా సేవలను గుర్తు చేసుకున్న మోడీ.. ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు.

దేశానికి సుష్మా నిస్వార్థంగా సేవలు అందించారని, ప్రపంచ వేదికలపై ఇండియా గొంతుకను వినిపించారని మెచ్చుకున్నారు. ఇండియాలో అత్యున్నత గౌరవం పొందే నాయకుల్లో సుష్మా ఒకరని, తన ప్రజా జీవితంలో కొన్నిసార్లు ఆమెతో కలసి పని చేశానన్నారు. ఆమె ఆకస్మిక మరణం అందరినీ కలచి వేసిందన్నారు. సుష్మా బహుముఖ ప్రజ్ఞాశాలి అని, బీజేపీ కార్యకర్తగా ఆమెను సుష్మాను దగ్గర నుంచి గమనించే వాళ్లమని మోడీ ట్వీట్ చేశారు.

Latest Updates