మున్సిపాలిటీల మ్యుటేషన్‌ పవర్‌ కట్‌

  •     డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌తో పాటే మ్యుటేషన్‌
  •     నేడు అసెంబ్లీ ముందుకు బిల్లు
  •     వీఆర్వోల రద్దు, రెవెన్యూ బిల్లులనూ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం  

హైదరాబాద్‌, వెలుగు: మున్సిపల్‌ కమిషనర్‌ చేతిలో ఉన్న మ్యుటేషన్‌ పవర్‌కు కత్తెర పడనుంది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్-2019 సవరణ బిల్లుతో మ్యుటేషన్‌ పవర్‌ సబ్‌ రిజిస్ట్రార్ల పరిధిలోకి వెళ్లనుంది. ఇకపై డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఇకపై ప్లాట్లు కొన్నవారు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌తో మ్యుటేషన్‌ కోసం మున్సిపల్‌ కమిషనర్‌కు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్‌లు,128 మున్సిపాలిటీల పరిధిలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. వీఆర్వో పోస్టుల రద్దుతో పాటు కొత్త మున్సిపల్‌ యాక్టును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ‘‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్-2020’’, ‘‘ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్-2020’’కి కేబినెట్  ఆమోదం తెలిపింది. సభ్యులు రెవెన్యూ బిల్లును స్టడీ చేయడానికి నాలుగు రోజుల టైం ఇచ్చి వచ్చే సోమవారం దీనిపై చర్చను ప్రారంభించనున్నారు.

ఇండ్లు, ప్లాట్లు కొనేవాళ్లకు లబ్ధి..

ఆటో మ్యుటేషన్‌ ప్రక్రియతో అర్బన్‌ ఏరియాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసే లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న ప్రతి ఒక్కరూ సంబంధిత ఇల్లు, ప్లాట్‌ను తమ పేరిట రికార్డుల్లో మార్పిడి చేసుకోవడానికి ఆయా కార్పొరేషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు అప్లై చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో సంబంధిత ఇల్లు, ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారో, రికార్డుల్లోనూ వారి పేరు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. దీంతో ఇండ్లు, ప్లాట్లు కొన్నవారికి టైం కలిసి రావడంతో పాటు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

Latest Updates