200 లారీల్లో సెక్రటేరియట్ శిథిలాల తరలింపు

జీడిమెట్లలోని రాంకీ ప్లాంట్ కు చేరవేత

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ శిథిలాల తరలిం పు ప్రక్రియను ముమ్మరం చేశారు. జీడిమెట్లలోని రాం కీ సంస్థకు చెం దిన ప్లాం ట్ కు 200 లారీల్లో శిథిలాలను తరలిస్తున్నారు. సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేతతో లక్ష టన్నులకుపైగా శిథిలాలు ఏర్పడ్డాయి. వీటిని తరలించేం దుకు నెల రోజులు పడుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. రాత్రింబవళ్లు లారీలు నడుస్తాయని, శిథిలాలు కనిపించకుండా లారీలపై పూర్తిగా కవర్ వేస్తున్నామని ఆర్అండ్ బీ అధికారులు తెలిపారు. మొత్తం ఆరేడు వేల లారీల శిథిలాలు ఉంటాయని చెపుతున్నారు. కాగా, ఇప్పటి వరకు జే, ఎల్ బ్లాకుల కూల్చి వేత 50 శాతం పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో వాటిని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. ఒకవైపు శిథిలాల తరలింపు ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు నేలను చదును  చేస్తున్నారు.

10 నెలల గడువు

కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ 10 నెలల గడువు పెట్టినట్టు ఆర్ అండ్ బీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సూచన మేరకు డిజైన్లలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తవగానే టెండర్లు పిలిచే యోచనలో ఆర్ అండ్ బీ శాఖ ఉంది. ఈ నెలలోనే నిర్మాణ పనులు ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తే సీఎం విధించిన గడువులోపు పనులు పూర్తి చేయొచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ‘‘సీఎం కేసీఆర్ ఫోకస్ అంతా సెక్రటేరియట్ పైనే ఉంది. త్వరలో ఆయన సెక్రటేరియట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు రెగ్యులర్ గా వస్తుంటారు’’ అని ఆయన చెప్పారు.

Latest Updates