బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను తొలగించండి: రాజాసింగ్

పాకిస్తాన్ కొడలైనా సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఆ దేశం  కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆమెకు బదులు తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు, సైనా నెహ్వాల్  ఇద్దరిలో ఒకరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని రాజాసింగ్ కోరారు. దీనికి సంబంధించి సోమవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Latest Updates