చెరువులో బియ్యం పోసి.. తూము కింద మంటపెట్టినట్లు టీఆర్ఎస్ మేనిఫెస్టో

చెరువులో బియ్యం పోసి.. తూము కింద మంట పెట్టి, ఊరందరని భోజనానికి పిలిచినట్లు టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బండి చక్రం మీద ఈగ ఆ చక్రాన్ని నేనే తిప్పుతున్న అని అనుకుంటుందట. అలాగే కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అంత కలిసి నెలకు రూ. 15 లక్షలు తీసుకుంటుందని.. ప్రజలకు మాత్రం రెండు వేల పెన్షన్స్ ఇస్తున్నామని గొప్పగా  చెప్పుకుంటున్నారన్నారు. 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో లేదు చెప్పండి అన్నారు. సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేటీఆర్ 50 సినిమాలు, 20 వెబ్ సిరీస్ లు చూశానని చెబుతున్నాడు. సెల్ఫీలు తీసుకొని కొంత మంది ప్రజలు ప్రాణాలు తీసుకుంటుంటే కేటీఆర్ వెబ్ సిరీస్ లు చూస్తూన్నాడన్నారు. కరెంట్ బిల్లులపై ఆందోళన చేస్తే అప్పుడు పట్టించుకోలేదని.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని విద్యుత్ బిల్లులు మినహాయింపు అంటున్నారన్నారు.

దేశం దశ దిశా మారుస్తాను..పెద్దమనుసులతో టచ్ లో ఉన్నాను అంటున్నావు.. ఎవరితో టచ్ లో ఉన్నావు..ఎవరా పెద్దమనుసులు, శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లిలతో ఉన్నవా అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను ప్రజలు జోకర్లుగా చూస్తున్నారని.. వారి మేనిఫెస్టే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా సినిమా వాళ్లకు రేషన్ కార్డ్స్ ఇస్తాడట. కాలుష్యానికి ఎన్నికలకు సంబంధం ఏంటన్నారు. కేటీఆర్ పారిశ్రామిక వేత్తల సమావేశానికి రావాలని పిసిబి వాళ్ళు మెసేజ్ లు పెట్టారన్నారు. సినిమా థియేటర్ల ఓపెనింగ్ పై సినిమా వాళ్లే నిర్ణయం తీసుకోవాలని వారికి చెప్పారు.. సినిమాలకు వెళితే కేసీఆర్ బ్రహ్మానందానికి మంచి పోటీ ఇచ్చేవాడన్నారు. కొడుకు బాబు మోహన్ కి మంచి పోటీ ఇచ్చేవాడని.. ఐటీ పరిశ్రమతో వీళ్లకు ఏమి సంబందం లేదన్నారు. ఐటీ ఏరియాలో డ్రైనేజ్ లేదని.. మిషన్ భగీరథ నీళ్లు రావన్నారు ఎంపీ అరవింద్.

Latest Updates