రాజకీయ రంగులు తొలగించండి: YCPకి హైకోర్టు ఆదేశాలు

YCP ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులకు సంబంధించి కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని సూచించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్టు పూర్తి ఆధారాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది.

రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Latest Updates