డ్రైవర్‌‌కు రూ.1,500.. కండక్టర్‌‌కు రూ.1,000 : RTC

రెమ్యునరేషన్ పై ఆర్టీసీ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు: టెంపరరీగా పనిచేసే డ్రైవర్, కండక్టర్లకు ఇచ్చే రెమ్యునరేషన్‌‌ను ఆర్టీసీ శనివారం ప్రకటించింది. ఈ మేరకు రీజినల్‌‌, డివిజన్‌‌, డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రైవర్లు, రిటైర్డ్‌‌ డ్రైవర్లకు ఒక రోజుకు రూ.1,500, కండక్టర్లు, రిటైర్డ్‌‌ కండక్టర్లకు రూ.1,000, రిటైర్డ్‌‌ ఆఫీర్లకు రూ.1,500, రిటైర్డ్‌‌ ట్రాఫిక్‌‌ సూపర్‌‌వైజర్లకు రూ.1,500 ఇవ్వనున్నట్లు తెలిపింది.

రిటైర్డ్‌‌ ఎలక్ట్రీషియన్ కు, రిటైర్డ్ టైర్‌‌ ఎలక్ట్రీషియన్‌‌కు రూ.1,000 చొప్పున అందజేయనుంది. అన్ని ఆర్టీసీ బస్సులు, హైర్‌‌తోపాటు ఏసీ బస్సులకు వర్తిస్తుందని పేర్కొంది.

Latest Updates