వెండితెరపైకి సుస్మితాసేన్ కూతురు రెనీ

అమ్మబాటలోనే అడుగులు వేస్తున్న రెనీ

బాలీవుడ్లో నెపోటిజంపై ఇప్పటికే అనేక విమర్శలు వినిపిస్తున్నా.. స్టార్ కిడ్స్‌‌‌‌ ఎంట్రీలు మాత్రం ఆగడం లేదు. ఆల్రెడీ జాన్వీకపూర్, అనన్యాపాండే లాంటి యంగ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌ తమ ముద్ర వేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సుస్మితాసేన్ ‌‌‌‌కూతురు రెనీ కూడా హీరోయిన్‌‌‌‌గా తొలి అడుగు వేయబోతోంది. ఓ వెబ్ మూవీతో అందరి ముందుకీ వచ్చేందుకు రెడీ అయ్యింది. కబీర్ ఖురానా దర్శకత్వంలో ‘సుత్తాబాజీ’ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. తల్లిదండ్రులకి, కూతురికి మధ్య సాగే ఎమోషనల్‌‌‌‌ డ్రామా అని తెలుస్తోంది. ఆదివారం ఇరవై ఒకటో పుట్టిన రోజు జరుపుకున్న రెనీకి సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ ఈ విషయాన్ని రివీల్ చేసింది సుస్మిత. సుశాంత్ మరణంతో  వారసుల సినిమాలపై పగబట్టిన ఆడియెన్స్‌‌‌‌ రెనీని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే చర్చ అప్పుడే ఇండస్ట్రీలో మొదలైంది.

 

Latest Updates