స్థాయిని దాటిన రేణూ మోండల్ మేకప్

రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకునే స్థాయి నుంచి బాలీవుడ్‌ సింగర్ గా ఎదిగారు రేణూ మోండల్. ప్రతిభ ఉంటే చాలు అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌ లో  ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై’ అనే పాట పాడగా…. ఆమె స్వరాన్ని విన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో  పాటలు పాడే అవకాశం వచ్చింది. దీంతో పాటు ఆమె పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.

రేణూ మోండల్ తాజాగా తన ముఖానికి వేసుకున్న మేకప్ కారణంగా విమర్శల పాలవుతున్నారు. ఆమె మేకప్ స్థాయి కాస్త అధికంగా ఉండడమే ఇందుకు కారణం. సెలబ్రిటీ అయితే మరీ ఇంతలా మేకప్ వేసుకోవాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఓవర్ మేకప్ వేసుకున్న ఆమెపై పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.

Latest Updates