ఉత్తమ జీవనం: ప్లాస్టిక్‌ బదులుగా వీటిని వాడండి

రోజు రోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతోందని, పర్యావరణం ఇంకా ఇంకా నాశనమవుతోందని అందరం బాధపడుతున్నాం. మరి దాని వాడకం తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కదా? బాత్‌ రూమ్‌ లో సబ్బుపెట్టె నుంచి టూత్‌ బ్రష్‌ వరకు కిచెన్‌ లో టిఫిన్‌ బాక్స్‌‌ నుంచి టీకప్‌ వరకు… అసలెక్కడ చూసినా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. మరి ఆ ప్లాస్టిక్‌‌కి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వెంటనే రిప్లేస్ చేయమంటున్నాయి!

కొన్ని పద్ధతులు మార్చుకోవడం, కొన్ని వస్తువులు రీప్లేస్ చేసుకోవడం అంతపెద్ద కష్టమైన పనేం కాదు. అలాంటి వాటిలో ప్లాస్టిక్‌ కి బదులుగా దాని ప్రత్యామ్నాయాల వాడకం కూడా ఒకటి!

టూత్‌ బ్రష్‌ బదులు..
ప్రపంచంలో ప్లాస్టిక్ టూత్ బ్రష్‌ లేని ఇల్లు లేదు. స్టైలిష్‌ గా ఉండే ప్లాస్టిక్‌ టూత్‌‌ బ్రష్‌ లు పల్లెటూర్లకు కూడా పాకాయి. మూడు నెలలకు ఒక్కటి చొప్పున ప్రతి మనిషి వాడి పారేస్తున్నాడు.వీటికి ‘ది బెస్ట్‌‌’ రిప్లేస్‌‌మెంట్‌ వేప పుల్లే! అయితే ‘వేపపుల్ల నూరుశాతం పళ్లను క్లీన్‌ చెయ్యలేదు, కానీ ఎన్విరాన్‌ మెంటల్ ఫ్రెండ్లీ’ అని డాక్టర్లు అంటున్నారు . ఎక్కడ చూసినా వేప చెట్లే ఉంటాయి కాబట్టి, పల్లెటూళ్లలో కొంతవరకు ఇది మంచి ప్రత్యామ్నాయమే. సిటీల్లో మాత్రం వేప పుల్లలు దొరకడం కష్టం . ఇప్పుడు ప్లాస్టిక్‌ టూత్ బ్రష్‌ లకు కరెక్ట్‌‌ రీప్లేస్‌‌మెంట్ వెదురు టూత్ బ్రష్‌ లు. ఇప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతయ్‌ అనుకుం టున్నారా? ఆన్‌ లైన్‌ లో, షాపింగ్‌ కాంప్లెక్స్‌ లో బాగానే దొరుకుతున్నాయి.

బాత్‌ రూమ్‌ లో
చాలామంది బాత్‌‌రూమ్‌ లో సబ్బును ప్లాస్టిక్‌ పెట్టెలోనే ఉంచుతారు. వాటి ప్లేస్‌‌లో స్టీల్‌‌, చెక్క పెట్టెలను వాడటం బెటర్. లేదంటే సబ్బుని ‘సోప్‌ సేవర్‌‌ బ్యాగ్‌ ’లో పెట్టాలి. దీంతో సబ్బుని స్క్రబ్‌ లాగా వాడుకోవచ్చు. సబ్బు కొంచెం కూడా వేస్ట్ కాదు. ప్లాస్టిక్ పేరుకుపోవడానికి మనం వాడే ప్లాస్టిక్ షాంపూ బాటిల్స్‌ , షాంపూ కవర్ల పాత్ర తక్కువేం కాదు. కాబట్టి షాంపూ బాటిల్స్‌, షాంపూ కవర్లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన షాంపూ బార్‌‌‌‌(సబ్బు)లను వాడాలి. బట్టలు ఉతకడానికి ప్లాస్టిక్ బ్రష్‌ లను వాడుతారు. దాని కంటే గుర్రం వెం ట్రుకలతో తయారుచేసిన బ్రష్‌ ని వాడాలి.

ఇంకా కొన్ని
ప్లాస్టిక్ బాటిల్‌‌కి బదులు రాగితో తయారు చేసిన బాటిల్‌‌ని వాడొచ్చు. కాపర్‌‌‌‌ బాటిల్‌‌లో నీళ్లు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బాటిల్‌‌లో కూల్‌‌ డ్రింక్ తాగితే.. దాన్ని పారేయాలనిపించదు. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా దాన్నే వాటర్ బాటిల్‌‌గా వాడుతుంటారు. కాబట్టి, సీసాల్లో అమ్మే కూల్‌‌డ్రింక్‌ తాగడం బెటర్‌‌‌‌. ఇంట్లో, ఆఫీస్‌‌లో పెన్నులు, క్లిప్పులు, స్టిక్ నోట్స్ పెట్టుకోవడానికి ప్లాస్టిక్ పెన్ హోల్డర్ బదులు వెదురు లేదా ఐరన్ పెన్ హోల్డర్‌‌‌‌ వాడాలి. కూరగాయలు కోయడానికి ప్లాస్టిక్ పిడి ఉన్న చాకుకి బదులు చెక్క పిడి ఉన్న చాకుని వాడాలి.

కూల్‌‌ డ్రింక్స్‌ , జ్యూసులు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రా కి బదులుగా గాజు లేదా స్టీల్ స్ట్రా వాడాలి. ప్లాస్టిక్ లంచ్‌ బాక్స్‌ ల ప్లేస్‌‌లో మునపటిలా స్టీల్‌‌ బాక్స్‌ లను రీప్లేస్ చేయాలి. వంట గిన్నెలు తోమడానికి ప్లాస్టిక్ స్క్రబ్బర్‌‌‌‌కి బదులు పీచుతో( ఒకప్పుడు పల్లెల్లో కొబ్బరి పీచు వాడేవాళ్లు) తయారు చేసిన స్క్రబ్బర్‌‌‌‌ లేదా ఐరన్ స్క్రబ్బర్‌‌‌‌ వాడటం మంచిది. చెవిలో గుబిలి తీసుకోడానికి ప్లాస్టిక్ ఇయర్‌‌‌‌ బడ్స్‌ కి బదులుగా మార్కెట్‌ లోకి ఆర్గా నిక్ ఇయర్‌‌‌‌ బడ్స్‌ వచ్చాయి. పి ల్లలకు ఆడుకునేందుకు ప్లాస్టిక్ బొమ్మలకు బదులు చెక్కబొమ్మలు కొనివ్వాలి. ప్లాస్టిక్ కాలిక్యులేటర్ కి బదులుగా వెదురుతో తయారు చేసిన కాలిక్యు లేటర్ వాడొచ్చు.

రీసైకిల్‌
కిచెన్‌ లో వాడే 90శాతం ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైకిల్ చేయొచ్చు. బాత్‌‌రూమ్‌ లో వాడే ప్లాస్టిక్‌ మాత్రం 50 శాతం వరకే రీసైకిల్‌‌ చేయొచ్చు. కాబట్టి బాత్‌‌రూమ్‌ లో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. వీటికోసం ప్రత్యేకమైన చెత్త బుట్ట మెయింటైన్ చెయ్యాలి. కొన్ని బ్యూటీ బ్రాండ్స్‌ ప్యాకేజింగ్‌ రిటర్న్ ప్రోగ్రామ్ నడుపుతున్నాయి. వాడిన తర్వాత వాళ్లకు ఇచ్చేస్తే తీసుకెళ్లి రీసైకిల్‌‌ చేస్తారు. షాపింగ్ కి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే కొన్ని వస్తువులు కొంటాం . వాటిలో ప్లాస్టిక్ వస్తువులే ఎక్కువ ఉంటాయి.

మళ్లీ ఐదు రూపాయలు పెట్టి కొని మరి.. ప్లాస్టిక్‌ కవర్లోనే వాటిని ప్యాక్ చేసుకుని ఇంటికొస్తాం . కానీ, ఒక నిమిషం ఆగి, ప్లాస్టిక్ అవసరమా? అని ప్రశ్నించుకుంటే .. ప్లాస్టిక్ స్థానంలో ఎన్విరాన్‌ మెంటల్ ఫ్రెండ్లీ జనపనార, కాగితం, క్లాత్‌‌ సంచుల్లో ప్యాక్ చేసుకోవచ్చు.

Latest Updates