పిట్టలు బతుకుతున్నయ్.. నెమళ్లు పెరిగినయ్

పిట్టలు బతుకుతున్నయ్.. నెమళ్లు పెరిగినయ్

జాతీయ పక్షి ఏంటి? ఇంకేంటి.. నెమలే కదా. వాటి సంఖ్య భారీగా పెరిగిందట. అవును, డ్యాన్స్​లో పక్షులకు కేరాఫ్​ అడ్రస్​గా ఉండే నెమళ్లు దేశంలో ఎక్కువైనయట. అక్కడితో ఆహా..ఓహో అనుకోవడానికి లేదు. ఎందుకంటే నెమళ్లు పెరిగినా మొత్తంగా పక్షుల సంఖ్య దేశంలో భారీగా పడిపోయిందట. పడిపోతోందట. అవును, ద స్టేట్​ ఆఫ్​ ఇండియాస్​ బర్డ్స్​ 2020 రిపోర్టు విషయాలు చెప్పింది. గుజరాత్​లో కన్జర్వేషన్​ ఆఫ్​ మైగ్రేటరీ స్పీసిస్​పై జరుగుతున్న 13వ కాన్ఫరెన్స్​ ఆఫ్​ పార్టీస్​ (సీఎంఎస్​ సీవోపీ 13) సదస్సు సందర్భంగా ఈ రిపోర్టును విడుదల చేశారు. మొత్తం 867 జాతుల పక్షులపై స్టడీ చేశారు. 15,500 మంది పక్షి సంరక్షకులు చేసిన పది లక్షలకు పైగా అబ్జర్వేషన్లలో తేలిన విషయాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఈ తాజా రిపోర్టును విడుదల చేశారు. రెండు విభాగాలుగా పక్షుల మనుగడను అంచనా వేశారు. లాంగ్​ టర్మ్​ (25 ఏళ్లలో పక్షుల సంఖ్య), కరెంట్​ ట్రెండ్స్​ (గత ఐదేళ్ల నుంచి పక్షుల సంఖ్య)తో పక్షుల లెక్క తీశారు. అశోక ట్రస్ట్​ ఫర్​ రీసెర్చ్​ ఇన్​ ఎకాలజీ అండ్​ ఎన్విరాన్మెంట్​, బాంబే నేచురల్​ హిస్టరీ సొసైటీ, వైల్డ్​లైఫ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, సలీమ్​ అలీ సెంటర్​ ఫర్​ ఓర్నిథాలజీ అండ్​​నేచురల్​ హిస్టరీ, వెట్​ల్యాండ్స్​ ఇంటర్నేషనల్​ సౌత్​ఏషియా సహా 10 సంస్థలు కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయి.

79 శాతం పోయినయ్​

కరెంట్​ ట్రెండ్స్​లో చూస్తే మొత్తం పక్షుల్లో 79 శాతం పక్షులు అంతరించిపోయాయని రిపోర్టు పేర్కొంది. లాంగ్​టర్మ్​లో చూస్తే 50 శాతం పక్షులు పోయాయని తెలిపింది. మొత్తంగా 101 జాతుల పక్షుల ‘మనుగడ’ పెద్ద ప్రమాదంలో పడిందని చెప్పింది. కరెంట్​ ట్రెండ్స్​లో 146 జాతుల పక్షుల మనుగడపై అంచనా వేస్తే అందులో 80 శాతం పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని, 50 శాతం పక్షుల అంతర్ధానం మరింత స్ట్రాంగ్​గా ఉందని పేర్కొంది. లాంగ్​టర్మ్​కు సంబంధించి 261 జాతుల పక్షుల వివరాలు సమగ్రంగా ఉన్నాయని రిపోర్టు చెప్పింది. అందులో 2000వ సంవత్సరం నుంచి 52 శాతం పక్షులు తగ్గిపోయాయని చెప్పింది.

నెమళ్లతో పంటలు పోతున్నయ్​

జాతీయ పక్షి నెమళ్ల విషయంలో మాత్రం ట్రెండ్స్​ రివర్స్​గా ఉన్నాయి. వేరే పక్షులు తగ్గిపోతున్నా, నెమళ్లు మాత్రం అటు లాంగ్​టర్మ్​, ఇటు కరెంట్​ ట్రెండ్స్​లో భారీగా పెరిగాయని రిపోర్ట్​ పేర్కొంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో అవి పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో నెమళ్లను కాపాడుతూనే పంటలకూ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని రిపోర్ట్​ సూచించింది.

గద్దలు, రాబందులకు కష్టాలే

గద్దలు, రాబందులు, వార్బ్లర్స్​(జిట్ట పక్షి, కోకిలలా పాడేది), వలస వచ్చే కొంగ జాతి పక్షులకు మాత్రం పెనుముప్పు ఎదురవుతోందని రిపోర్ట్​ హెచ్చరించింది. వాటి సంఖ్య భారీగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, దేశం లోలోపలే వలస వెళ్లే పక్షులూ భారీగా పడిపోతున్నాయని పేర్కొంది. 1990 నుంచి రాబందులు, బస్టర్డ్​లు ఎక్కువగా కనుమరుగవుతున్నాయని చెప్పింది. అంతరించిపోయే జాతుల్లో చేర్చిన గ్రీన్​ మ్యూనియా, జెర్డన్​ కోర్సర్​ అనే పక్షులూ కనిపించకుండా పోతున్నాయట. 1986 నుంచి జెర్డన్​ కోర్సర్​ అనే పక్షి ఆనవాళ్లే కనిపించలేదట. ఇప్పటికే అంతరించిపోయాయనుకున్న అడవి జాతి గుడ్లగూబలు 1997లో కనిపించాయని, అయితే, వాటి సంఖ్య కూడా బాగా తక్కువగా ఉందని రిపోర్ట్​ పేర్కొంది.

రోజూ 60

ఓ దేశీ ఆవు మామూలుగా అయితే రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? మహా అయితే రోజుకు పది లీటర్లు. కానీ, రోజుకు ఓ ఆవు 60 లీటర్ల పాలిస్తే.. పోటీల్లో ఫస్ట్​ ప్రైజ్​ గెలిచేస్తే..? అవును, నేషనల్​ డెయిరీ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (ఎన్​డీఆర్​ఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన నేషనల్​ డెయిరీ మేళాలో ఓ ఆవు ఆ ఘనత సాధించింది. 58.86 లీటర్ల పాలిచ్చి ఫస్ట్​ ప్రైజ్​ కొట్టేసింది. అందంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. హర్యానాలోని కర్నాల్​ జిల్లా దాదూపూర్​ గ్రామానికి చెందిన ప్రదీప్​ అనే రైతుకు చెందిన హెచ్​ఎఫ్​ క్రాస్​బ్రీడ్​ ఆవు ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ హెచ్​ఎఫ్​ జాబితాలో బరణి ఖల్సాకు చెందిన విజేందర్​ చౌహాన్​ అనే రైతుకు చెందిన మరో ఆవు 58.17 లీటర్ల పాలిచ్చి రెండో ప్రైజును సొంతం చేసుకుంది. ఇతర క్రాస్​బ్రీడ్​ జాతుల ఆవులకు సంబంధించిన పోటీల్లో అంబాలా రైతు జస్దీప్​ సింగ్​కు చెందిన ఆవు 26.97 లీటర్ల పాలిచ్చి ఫస్ట్​ ప్రైజు సొంతం చేసుకుంది. దేశీ కేటగిరీలో తరౌరీకి చెందిన రామ్​సింగ్​ ఆవు 21.31 లీటర్ల పాలతో ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. నరేశ్​ అనే రైతుకు చెందిన ఆవు 15.81 లీటర్లతో రెండో స్పాట్​లో నిలిచింది. ఇక, ముర్రే జాతి గేదెల పోటీల్లో అసంధ్​కు చెందిన రణ్​దీప్​ అనే రైతుకు చెందిన గేదె 21.77 లీటర్ల పాలిచ్చింది. ఫస్ట్​ ప్లేస్​ కొట్టేసింది.