బీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్..దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం అవినీతి పాలన నడుస్తుందన్నారు. ఒక కుటుంబం కోసం ప్రభుత్వం నడుస్తోందని..అంబేద్కర్ బతికి ఉంటే బాధ పడేవారన్నారు. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే విదంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. రైతుల కోసం కేంద్రం చట్టం తీసుకొస్తే.. కొన్ని పార్టీలు ఎలా వ్యతిరేకిస్తున్నాయో చూస్తున్నామన్నారు. వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ మోడీకి అండగా నిలిస్తున్న తెలంగాణ రైతులకు ధన్యవాదాలు అన్నారు.

Latest Updates