నన్ను మళ్లీ గెలిపించకుంటే… ఎకానమీ డౌనైతది

వాషింగ్టన్:  తనను మరోసారి గెలిపించకపోతే దేశం మాంద్యంలోకి వెళుతుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రజలను హెచ్చరించారు. లూసియానాలో రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మరోసారి  గెలవబోతున్నాం’ అంటూ పార్టీ కార్యకర్తల ఎదుట ఆయన ధీమా వ్యక్తం చేశారు. “నా పాలనలో  అమెరికా ఎకానమీ బూమ్ లో ఉంది. నన్ను  మరోసారి ఎన్నుకోకుంటే దేశం కనివినీ ఎరుగని  మాంద్యంలోకి వెళ్తుంది” అని అమెరికన్లను హెచ్చరించారు.

తనపై ఇంపీచ్ మెంట్ ప్రొసీడింగ్స్ ఈ నెల 13న మొదలవుతాయని హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడం షిఫ్  ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దేశాన్ని  చీల్చాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్, ఆయన కొడుకుపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తేవటానికి ట్రంప్ ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. జోబిడెన్, ఆయన కొడుకు ఉక్రెయిన్ కు చెందిన బురిస్మా గ్యాస్ కంపెనీతో కలిసి పని చేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి.

Mandatory Credit: Photo by Evan Vucci/AP/Shutterstock (10434333bm)
Donald Trump, Sauli Niinisto. President Donald Trump speaks during a meeting with Finnish President Sauli Niinisto in the Oval Office of the White House, in Washington
Trump, Washington, USA – 02 Oct 2019

Latest Updates