పరిశోధనలపై జర్మనీ వర్సిటీతో ఓయూ ఒప్పందం

research-osmania-university-deel-germeny-varsity

పరిశోధనల  రంగంలో  సహకరించుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ,  జర్మనీకి  చెందిన  OTH వర్సిటీ  మధ్య అవగాహన  ఒప్పందం కుదిరింది.  రెండు  విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా  పరిశోధనలు  చేయడం, సెమినార్స్ , సమ్మర్ స్కూల్స్  నిర్వహణ , సదస్సులు , విద్యార్థులు,  ఫ్యాకల్టీస్ ఎక్చేంజ్ తో  పాటు ….లేబొరేటరీ లో  అడ్వాన్సుడ్  రీసెర్చ్ చేపట్టడంపై   MOU కుదిరింది.  జర్మనీకి   చెందిన  ప్రొఫెసర్లు  త్వరలోనే  ఉస్మానియా యూనివర్సిటీని  సందర్శించనున్నారు.

OUతో  కలసి  పనిచేయడం  సంతోషంగా ఉందన్నారు  OTH అధికారులు.  ఉస్మానియాకి  చెందిన  ప్రొఫెసర్లు  డాక్టర్ పి.నవీన్ కుమార్,  డాక్టర్ అక్తర్ అలీతో  పాటు  OTH యూనివర్సిటీ  ప్రెసిడెంట్,  వైస్ ప్రెసిడెంట్,  ఇంటర్నేషనల్  ఆఫీస్  డైరెక్టర్ తో పాటు  ప్రొఫెసర్లు  ఈ MOU  కార్యక్రమంలో  పాల్గొన్నారు.