సాయంతో పాజిటివ్ ఆలోచనలు..!

సాయం మంచిదే..సాయం చేయండి.. అంటూ దగ్గరికి వచ్చి అడిగినా చేసేవాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువ. పైగా సాయం అడిగినవాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడేవాళ్లే ఎక్కువ. నిజంగా సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే.. చేయలేనని చెబితే సరిపోతుంది. కానీ.. ఆ విషయం చెప్పకుండా సాయం అడగడానికి వచ్చినవాళ్లను కించపరుస్తూ మాట్లాడడం సరికాదు. నిజంగా సాయం చేసే స్థితిలో ఉంటే తప్పకుండా కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవాలి. ఎందుకంటే.. చేస్తున్న సాయం వల్ల దానిని పొందినవాళ్లకే కాదు, సాయం చేసినవాళ్లకు కూడా లాభం ఉందని చెబుతున్నారు లండన్ పరిశోధకులు. సాయం చేయడం వల్ల కలిగే సంతృప్తి పాజిటివ్ ఆలోచనలను పెంచుతుందని, పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వారు.

ఇప్పటిదాకా ఎక్కువ రోజులు బతికినవాళ్ల లైఫ్ స్టైల్ ను పరిశీలిస్తే.. వాళ్ల ఆలోచనలు పాజిటివ్ గానే ఉండడాన్ని గుర్తించారట. ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నా, అన్ని రకాల పోషకాలను రోజూ ఆహారంలో భాగం చేసుకున్నా .. ఆలోచనలు నెగెటివ్ గా ఉంటే.. అది అనారోగ్యానికి దారితీస్తుందని గుర్తించారు. అందుకే కుదిరితే సాయం చేయడం మంచిదని, చేయలేని స్థితిలో ఉంటే సున్నితంగా చేయలేనని చెప్పాలని సూచిస్తున్నారు. అయితే సాయం చేయాలంటే ధనవంతులమే కానక్కర్లేదు. వాళ్ల అవసరాలు తీర్చగలిగితే చాలు. అప్పటికి వాళ్లను కష్టం నుంచి గట్టెక్కించగలిగితే చాలు.

see also: బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

see also: సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!

Latest Updates