ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ను రికార్డ్ చేసిన సైంటిస్టులు

ఆస్ట్రేలియాలోని మొనాశ్ వర్సిటీలో ఎక్స్ పెరిమెంట్
మెల్ బోర్న్: వరల్డ్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ డేటా స్పీడ్ ను ఆస్ట్రేలియాలో సైంటిస్టులు రికార్డు చేశారు. తాజా డేటా స్పీడ్ తో ఒక్క క్షణం వ్యవధిలో 1,000 హెచ్ డీ సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సైంటిస్టులు సింగిల్ ఆప్టికల్ చిప్ ను యూజ్ చేసి దీన్ని సాధించారు. ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న నెట్ వర్క్ కనెక్షన్స్ కెపాసిటీని పెంచడం సులువయ్యే చాన్సెస్ ఉన్నాయి. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురితమైన ఓ స్టడీ ప్రకారం ఈ కొత్త ప్రయోగంతో టెలీ కమ్యూనికేషన్ కెపాసిటీని పెంచొచ్చు.

బిల్ కార్కోరన్ అనే రీసర్చర్ తోపాటు ఆయన బృందం కలసి ఆస్ట్రేలియాలోని మొనాశ్ యూనివర్సిటీలో ఒక సింగిల్ లైట్ సోర్స్ తో 44.2 టెరాబైట్స్ పర్ సెకన్ (టీబీపీఎస్) డేటాను రికార్డు చేశారు. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ నెట్ వర్క్ లాగే ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీకి తమ డివైజ్ ను అనుసంధానం చేయడంతో ఈ ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అయిందని సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ప్రాక్టికల్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ నెట్ వర్క్స్ లో ఆప్టికల్ మైక్రో కాంబ్స్ ఎలా పని చేస్తాయో అనే దానికి ఈ ప్రయోగం ఒక ఉదాహరణ అని వారు పేర్కొన్నారు.

Latest Updates