లక్ష్మీ విలాస్ బ్యాంక్ లో నిధుల దుర్వినియోగం : కేసు నమోదు

మెర్జర్‌‌కు ఆర్‌‌బీఐ బ్రేకు ముంబై : ఇండియాబుల్స్‌‌ హౌసింగ్‌‌ ఫైనాన్స్‌‌తో విలీన ప్రతిపాదనను రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా తిరస్కరించినట్లు లక్ష్మీవిలాస్‌‌ బ్యాంక్‌‌ బుధవారం ప్రకటించింది. ఇండియాబుల్స్‌‌ హౌసింగ్‌‌ ఫైనాన్స్‌‌ అండ్‌‌ ఇండియాబుల్స్‌‌ కమర్షియల్‌‌ క్రెడిట్‌‌ లిమిటెడ్‌‌తో లక్ష్మీ విలాస్‌‌ బ్యాంక్‌‌ (ఎల్‌‌వీబీ) స్వచ్ఛంద విలీనాన్ని ఆమోదించలేకపోతున్నట్లు ఆర్‌‌బీఐ మంగళవారం ఒక లెటర్‌‌లో తెలిపిందని ఎల్‌‌వీబీ స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లకు వర్తమానం పంపింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌ నెలలో రెండు కంపెనీలు విలీన ప్రతిపాదనను చేశాయి. ఈ స్కీము కింద లక్ష్మీ విలాస్‌‌ బ్యాంక్‌‌ను ఇండియాబుల్స్‌‌ హౌసింగ్‌‌ ఫైనాన్స్‌‌లో విలీనం చేయాలనుకున్నారు. ఎన్‌‌పీఏలు ఎక్కువవడంతో గత నెలలో ఎల్‌‌వీబీని ప్రాంప్ట్‌‌ కరెక్టివ్‌‌ యాక్షన్‌‌ (పీసీఏ) ఫ్రేమ్‌‌వర్క్‌‌లోకి ఆర్‌‌బీఐ తెచ్చింది. వరసగా రెండేళ్లపాటు అసెట్స్‌‌పై ప్రతికూల ఫలితాలు తెచ్చుకోవడంతోపాటు, రిస్క్‌‌ను తట్టుకునేంత క్యాపిటల్‌‌ లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌‌బీఐ తెలిపింది. ఎల్‌‌వీబీ డైరెక్టర్లు మోసానికి పాల్పడమే కాకుండా, నిధులను దుర్వినియోగపరిచారని ఢిల్లీ పోలీసులు ఒక కేసును నమోదు చేశారు. ఆ తర్వాతే ఆర్‌‌బీఐ ఈ బ్యాంకును పీసీఏ ఫ్రేమ్‌‌లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

Latest Updates