రిజైన్ చేయమంటున్నారు…బాధగా ఉంది

=అమెరికా డిమాండ్ పై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ టెడ్రోస్

కరోనా నివారణలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందంటూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ను రిజైన్ చేయాలంటూ చాలా డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యం గా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు టెడ్రోస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై తొలిసారి ఆయన స్పందించారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ గా పనిచేయటం దేవుడిచ్చిన వరమని…ఈ అవకాశాన్ని ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ఇలాంటి విమర్శలు తనను బాధించాయన్నారు. డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ విమర్శిస్తూ అమెరికా ఇచ్చే నిధులను ఇప్పటికే నిలిపివేసింది. ఆ సంస్థకు నిధులు ఇవ్వాలనుకుంటే టెడ్రోస్ రిజైన్ చేయాలనే కండిషన్ పెట్టాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు ట్రంప్ కు సూచించారు. ఐతే నిధుల విషయంలో అమెరికా మరోసారి పాజిటివ్ గా ఆలోచిస్తుందన్న నమ్మకం ఉందన్నారు టెడ్రోస్. నిధుల నిలిపివేత కారణంగా సంస్థ ప్రధాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని…పిల్లల్లో ఇమ్యూనిటీ, పోలియో నిర్మూలన సేవలకు ఇబ్బంది తప్పదని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ చీఫ్ మైక్ ర్యాన్ చెప్పారు.

Latest Updates