ఆసీస్‌ సిరీస్‌ : రోహిత్‌ కు రెస్ట్‌‌‌‌ !

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్‌‌‌‌కప్‌ లో అత్యుత్తమ జట్టును బరిలోదింపే ముందు టీమిండియాను ఆఖరిసారి పరీక్షించుకోవడానికి మేనేజ్‌ మెంట్‌ కు ఒకే ఒక అవకాశం మిగిలుంది. టీమిండియా ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రస్తుత వరల్డ్‌‌‌‌ చాంపి యన్‌‌‌‌ ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్‌ లో టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడుతుంది. వరల్డ్‌‌‌‌కప్‌ ప్రారంభానికి ముందు ఇండియాకు మిగిలిన ఈ ఏడు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లు చాలా కీలకం. ఆసీస్‌ సిరీస్‌ కోసం ఈసారి 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వం లోని సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఈ నెల 15వ తేదీన ప్రకటించనుంది. ఇక స్వదేశంలో జరిగే ఆసీస్‌ సిరీస్‌ నుంచి టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి నిచ్చేఅవకాశం ఉంది. అయితే పూర్తి సిరీస్‌కు విశ్రాంతి నిస్తారా, లేక కొన్ని మ్యాచ్‌ లకు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.

Latest Updates