ప్రారంభం కానున్న రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు..రిటైల్ ధరలకే అమ్మకాలు

ఆదివారం నుంచి మే 17వరకు  రెస్టారెంట్లు, పబ్బులు, బార్లను ఓపెన్ చేసుకోవచ్చని కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటిల్లో  ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్మేందుకు అనుమతిచ్చింది. కర్నాటక ప్రభుత్వం మంగళవారం, బుధవారం, గురువారాల్లో జరిగిన మద్యం అమ్మకాల్లో 200కోట్లతో భారీ ఆదాయాన్ని అర్జించింది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా.. కర్నాటకలో మాత్రం నిబంధనల్ని సడలిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది.

రాబోయే రోజుల్లో కరోనా లాక్ డౌన్ తో ఆర్థికపరమైన సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. అంతేకాదు అన్నీ రాష్ట్రాల్లో మద్యం ధరలు పెంచినట్లుగా కర్నాటక ప్రభుత్వం సైతం మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 11శాతం పెంచింది.

Latest Updates