ఉలురు.. ఇక ఎక్కలేరు: 50 కోట్ల ఏళ్లనాటి పర్వతం..!

ఫొటోలో కనబడుతున్న ఎర్రటి పర్వతం పేరు ఉలురు. ఆస్ట్రేలియాలోని ఉలురు—- కట జుట నేషనల్ పార్క్లో ఉంది. ఆ ఖండంలో ఎత్తైన పర్వతమిది. దీన్ని ఎక్కేందుకు పర్వతారోహకులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇక ముందు ఎక్కే చాన్స్ లేదు. 2019 అక్టోబర్ 26 నుంచి క్లైంబింగ్ నిషేధిస్తున్నట్టు పార్కు బోర్డు ఈమధ్యే నిర్ణయించింది. కారణం.. అక్కడి యాంకునిజాట్జర, పిట్జన్జాట్జర తెగలకు ఈ పర్వతం పవిత్రమైనది. దాన్ని ఎక్కొద్దని వాళ్లు చాలా కాలంగా కోరుతున్నారు.

మరోవైపు ఆ పర్వతం చాలా నిటారుగా ఉంటుంది. ఎక్కేందుకు అంత ఈజీ కాదు. దాన్ని ఎక్కబోయి ఇప్పటివరకు 30 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ రెండు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 348 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతం 50 కోట్ల ఏళ్లనాటిదట.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates