బిర్యానీలో బొద్దింక

జనగామ అర్బన్ , వెలుగు: జిల్లా కేంద్రంలో రెస్టారెంట్లు, హోటళ్లపై సంబంధిత అధికారులతో పాటు స్వయంగా జిల్లా కలెక్టర్ తనిఖీలు చేస్తున్నా నిర్వాహకుల్లో మార్పు రావడంలేదు. జిల్లా కేంద్రంలో ఒక రెస్టారెంట్‌ లో శుక్రవారం తిప్పారపు జానీ, శ్రీకాంత్ బిర్యానీ అర్డర్ ఇచ్చారు. తెచ్చిన బిర్యానీలో బొద్దింక ఉండటం గమనించి వెయిటర్ పిలిచి అడిగారు. కంగారు పడిన అతడు.. చూసుకోలేదని, వేరే ప్లేట్​తెస్తామని, బిల్లు చెల్లిం చనవససరం లేదని చెప్పాడు. అధికారులు జరిమానాలతో కాలం వెల్లదీస్తుండటంతో హోటళ్ల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని స్థా నికులు వాపోతున్నారు.

Latest Updates