కారుతో బైక్ ను ఢీకొట్టిన రిటైర్డ్ పోలీస్

కారుతో బైక్ ను ఢీకొట్టి పరారయ్యాడు ఓ రిటైర్డ్ పోలీస్. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రం రాజీవ్ బైపాస్ లో జరిగింది. మంగళవారం పొద్దున కారును వేగంగా నడుపుకుంటూ వెళ్తున్న ఏఎస్సై హస్నుద్దీన్ మలుపుతిరుగుతున్న ఓ బైక్ ను ఢీకొట్టాడు. ఆతర్వాత పరారి అయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను చెక్ చేయగా… యాక్సిడెంట్ చేసిన అతను రిటైర్డ్ ఏఎస్సై హస్పుద్దీన్ గా తేలచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates