నా చావుకు చిదంబరమే కారణం!

  • లెటర్‌‌‌‌‌‌‌‌ రాసి ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్‌‌‌‌‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:   దేశంలో దిగజారిన ఆర్థిక పరిస్థితికి  కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం కారణమని ఆరోపిస్తూ ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన  రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబం కూడా చిదంబరం ఆర్ధిక విధానాల వల్ల చితికిపోయిందని  విమర్శించారు. చనిపోయిన ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను బిజన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. అసోంలోని మంగళ్‌‌‌‌‌‌‌‌దోయ్‌‌‌‌‌‌‌‌  దాస్‌‌‌‌‌‌‌‌  సొంతూరు . ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌లోని హోటల్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు పేజీల సుసైడ్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌ను ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాశారు.  ఆర్థిక రంగం నెమ్మదించడానికి గతంలోని యూపీఏ పాలన నాటి అవినీతి, చిదంబరం ఆర్థిక విధానాలే  కారణమని దాస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  తన కుటుంబాన్ని  బాగా చూసుకోవాలని,  ముఖ్యంగా సింగర్‌‌‌‌‌‌‌‌ కావాలనుకుంటున్న కొడుకు బాగోగులు చూడాలంటూ దాస్‌‌‌‌‌‌‌‌ ఆ లెటర్‌‌‌‌‌‌‌‌లో  ప్రధానిని కోరారు.  హోటల్‌‌‌‌‌‌‌‌ రెంట్‌‌‌‌‌‌‌‌ చెల్లించడానికి, అంత్యక్రియలకు ఆయన కొంత డబ్బును అక్కడ ఉంచారు. ఈనెల ఆరో తేదీ నుంచి దాస్‌‌‌‌‌‌‌‌ ప్రయాగ్‌‌‌‌‌‌‌‌లోని హోటల్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్న ఆయన బయటకు రాకపోవడంతో…హోటల్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి అనుమానం వచ్చి చూడడంతో  సీలింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు దాస్‌‌‌‌‌‌‌‌ ఉరివేసుకోవడాన్ని వాళ్లు గుర్తించారు.

 

Latest Updates