ఆర్డీఓ ఆఫీస్ ముందు రిటైర్డ్ ఆర్డీఓ నిరసన

retired-rdo-protest-infront-of-nalgonda-rdo-office

నల్లగొండ :  నల్లగొండ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రిటైర్డ్ ఆర్డీఓ బషీరొద్దీన్ ఆందోళనకు దిగారు. తన కుమారులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయడంలో అధికారులు రెండేండ్లుగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. వారి ‌నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. న్యాయవాది, సివిల్ ఇంజినీర్లు అయిన మసియొద్దీన్, జియావుద్దీన్‌లతో కలసి గురువారం నిరసన చేపట్టారు. 20 ఏండ్ల‌ క్రితం తాము కొనుగోలు చేసి అనుభవిస్తున్న భూమికి అధికారులు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని.. దీంతో తమకు రైతుబంధు సాయంతో పాటు వ్యవసాయ రుణం సైతం అందడం లేదని బషీరొద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనగల్ మండలం తేలకంటిగూడెం పరిధిలోని తమ భూమికి వెంటనే పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు.

Latest Updates