రిటైర్మెంట్‌‌ ఏజ్‌ 61 ఏళ్లకు పెంపు..!

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును  60 లేదా 61 ఏండ్లకు పెంచుతాయని సీఎం కేసీఆర్​ అన్నట్లు సమాచారం. 30 రోజుల యాక్షన్​ ప్లాన్​పై సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది.  అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్ట్​ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమోషన్ల కోసం పైరవీలు చేసే పరిస్థితి పోవాలన్నా రు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామని సీఎం ప్రకటించారు. వయో పరిమితి పెంపుపై త్వరలో నిర్ణయం ఉంటుం దని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావే శాల అప్పు డూ చెప్పారు. అయితే రిటైర్మెంట్ వయస్సును 60 లేదా 61 ఏండ్లకు పెంచుతామని ఇప్పుడు సీఎం చెప్పారు. కోర్టుల్లో వేసిన కేసు లు వాపస్​ తీసుకోవాలని, ఉద్యోగు లందరికీ ప్రమోషన్లు ఇస్తామన్నారు.

చెప్పిన పని చేయకుంటే ఔట్‌‌

30 రోజుల యాక్షన్ ప్లాన్ మీటింగ్​లో కలెక్లర్లు, అధికారులకు సీఎం టార్గెట్ పెట్టారు. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్​లతో ఫ్లయింగ్​ స్క్వాడ్ వేస్తానని, 30 రోజుల్లో అనుకున్నట్టు పనులు అవుతున్నా యో లేదో ఈ స్క్వాడ్ చెక్ చేయా లని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారో.. పని లో పురోగతి ఏంటో ఈ స్క్వాడ్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. చెప్పినట్టుగా పనులు కాకపోతే ఉద్యోగాలు పోతాయని సీఏం వార్నింగ్​ ఇచ్చారు. ఏడాదిలో కలెక్టర్లు ఏం పనిచేశారో వాళ్ల పనితీరు ఎలా ఉందో సీఎస్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి, సీఎంకు పంపుతారు. కానీ యాక్షన్​ ప్లాన్ మీటింగ్​లో ఇక నుంచి కలెక్టర్ల ఇయర్లీ రిపోర్ట్ తానే రాస్తానని సీఎం అన్నారు.  తనిఖీల్లో కలెక్టర్లు నిర్లక్ష్యం వహించొద్దని పరోక్షంగా హెచ్చరించారు.

Latest Updates