సమ్మె శిబిరంలోనే ఆర్టీసీ కార్మికుడి రిటైర్మెంట్

అచ్చంపేట, వెలుగు: 30 ఏళ్లుగా ఆర్టీసీలో  విధులు నిర్వహించిన ఓ కార్మికుడు సమ్మె శిబిరంలో ఉద్యోగ విరమణ వీడ్కోలు పొందాడు. అచ్చంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్​గా చేస్తున్న కేఎస్​రావు రిటైర్మెంట్​వేడుకను శనివారం తోటి కార్మికులు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సంస్థ కోసం మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కార్మికుడిని గౌరవంగా డిపో నుంచి పంపించాల్సి ఉండగా, ప్రభుత్వ మొండివైఖరితో సమ్మె శిబిరంలోనే వీడ్కోలు మీటింగ్​ జరపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేఎస్​రావును పలువురు కార్మికులు శాలువా, పూలమాలలతో సన్మానించారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates