ప్రైవేటు ఉద్యోగులకూ ఫుల్ పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యో గుల మాదిరే ప్రైవేటు రిటైర్డ్‌‌ ఉద్యోగులకూ తమ ఫుల్‌‌ సాలరీ ప్రకారం మొత్తం పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్‌ ను రూ.15వేలకు పరిమితం చేస్తూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ ఓ) తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ విషయమై కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈపీఎఫ్‌ ఓ దాఖలు చేసిన స్పెషల్‌‌ లీవ్‌ పిటిషన్‌ ను కొట్టేసింది. అయితే ఇక నుంచి ప్రైవేటు రిటైర్డ్‌‌ ఉద్యోగుల పెన్షన్‌ పెరిగినా, పీఎఫ్‌ కార్పస్‌ తగ్గుతుంది. ఉద్యోగి అదనంగా చెల్లించే మొత్తాన్ని పీఎఫ్‌ లో కాకుండా ఈపీఎస్‌లో జమ చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌ )ను తీసుకొచ్చిం ది. ఇందుకోసం ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 8.33 శాతం మొత్తాన్నిమినహాయించుకునేవారు. ఈ మొత్తం రూ.6,500 మించకుండా పరిమితి విధించారు. మరుసటి ఏడాది రూల్స్‌‌ మార్చారు. ఉద్యోగికి, కంపెనీకి అభ్యంతరం లేకుంటే ఉద్యోగి వాస్తవిక జీతం నుంచి పూర్తిగా 8.33 శాతం డబ్బును ఈపీఎస్‌ కోసం మినహాయించుకోవడానికి అనుమతి ఇచ్చారు. 2014, సెప్టెంబరులో చట్టాన్ని సవరించి ఉద్యోగి వాటా పరిమితిని రూ.15వేలు చేశారు. పూర్తిజీతంపై పెన్షన్‌ చెల్లిస్తా మని, అయితే ఉద్యోగి రిటైర్మెమెంట్‌ కు ముందున్న ఐదు సంవత్సరాల జీతం సగటు ప్రకారం ఇస్తామని ప్రకటించారు. ఆఖరి సంవత్సరం జీతం ప్రకారం పెన్షన్‌చెల్లించకపోవడంతో పెన్షన్‌ మొత్తం బాగా తగ్గింది. దీనిపై కేరళ హైకోర్టు స్పం దిస్తూ చివరి సంవత్సరంజీతం ఆధారంగానే పెన్షన్‌ ఇవ్వాలని తీర్పు చెప్పింది.మొత్తం జీతం నుంచి (ఫుల్‌‌ సాలరీ) పెన్షన్‌ నిధికిఉద్యోగి వాటా తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయినా స్పందించని ఈపీఎఫ్‌ ఓ స్పెషల్‌‌ లీవ్‌ పిటిషన్‌ వేయగా, అత్యు న్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2014, సెప్టెంబరు ఒకటి తరువాత ఉద్యో గంలో చేరిన వారు రిటైర్‌ మెంట్‌ తరువాత ఫుల్‌‌ సాలరీ ప్రకారం పెన్షన్‌ పొందడానికి ఈ తీర్పు వీలు కల్పిస్తుంది. 33 ఏళ్లకు రిటైర్‌ అయిన ఉద్యోగి చివరి జీతం రూ.50 వేలు ఉంటే, గతంలో అతనికి రూ.5,180 పెన్షన్‌ వచ్చేది. ఇప్పుడు అది 383 శాతం పెరిగి రూ.25 వేలకు చేరుతుంది.

Latest Updates