క్వారంటైన్ లో ఉంటారా.. జైలుకు వెళ్తారా?

ఇంఫాల్: విదేశాలతోపాటు స్వదేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి మణిపూర్ కు తిరిగి వస్తున్న వారు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని ఆ రాష్ట్ర సీఎం ఎన్. బిరెన్ సింగ్ స్పష్టం చేశారు. రిటర్నీస్ క్వారంటైన్ లో ఉండకపోతే వారిని అరెస్టు చేసి జైల్ లో పెడతామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 ప్రకారం విచారిస్తామని బిరెన్ చెప్పారు.

‘ఇది చాలా తీవ్రమైన సమస్య. మణిపూర్ కు తిరిగి వస్తున్న వారు ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతాం. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం మా ప్రథమ కర్తవ్యం’ అని బిరెన్ పేర్కొన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న ఇబ్బందులున్న నేపథ్యంలో కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రీసెంట్ గా మణిపూర్ లో 24 పాజిటివ్ కేసులు రావడంపై ఆయన స్పందిస్తూ.. ప్రజలు ప్యానిక్ కావొద్దన్నారు. ప్రస్తుత పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి తాము ప్రిపేర్డ్ గా ఉన్నామని వివరించారు.

Latest Updates