సొంతూళ్ల నుంచి తిరిగొస్తున్నరు

సిటీ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్

తర్వాత సిటీబాట పట్టిన ఉద్యోగులు, చిరు వ్యాపారులు

రద్దీ రూట్లలో లాక్ డౌన్ కు ముందు పరిస్థితులు

పెరిగిన ఓన్ వెహికల్స్ యూసేజ్

హైదరాబాద్, వెలుగు: ఐదు నెలల తర్వాత సిటీ రోడ్లపై మళ్లీ ట్రాఫిక్ పెరుగుతోంది. లాక్ డౌన్ టైమ్ లో ఇక్కడ ఉపాధి లేకపోవడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో లక్షల మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామాల్లోనూ కరోనా కేసులు వస్తుండగా, అన్ లాక్ తర్వాత సిటీలో ఆఫీసులు, వ్యాపార సంస్థలు మళ్లీ ఓపెన్ అవుతుండగా తిరిగొస్తున్నారు. అలా వస్తున్న వారిలో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. కొందరు ఫ్యామిలీస్ ని ఊళ్లలోనే ఉంచి సింగిల్ గా వస్తుంటే, మరికొందరు ఫ్యామిలీతో వస్తున్నారు. దాంతో క్రమంగా ట్రాఫిక్ పెరుగుతోంది.

అన్ లాక్–1లో సిటీలో 10 కిలో మీటర్లు ప్రయాణించాలంటే 20 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, ప్యారడైస్, అఫ్జల్ గంజ్ , ఎల్ బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, చాదర్ ఘాట్, కోఠి, దిల్ సుఖ్ నగర్, కర్మాన్ ఘాట్, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్ వంటి ఏరియాల్లో జర్నీకి ఇప్పుడు మామూలు రోజుల్లాగే టైమ్ పడుతోంది. లాక్ డౌన్ కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో మెట్రో సేవలు కూడా ప్రారంభం కానుండగా ట్రాఫిక్ మరింత పెరగనుంది.

బిజినెస్ లు షురూ..

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తగ్గుతోందని అధికారులు ప్రకటిస్తుం డటంతో సిటీకి తిరిగొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారం రోజులుగా టీ స్టాల్స్, ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లతో పాటు వీధి వ్యాపారాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. దాదా పు 40 శాతం తెరుచుకున్నాయి. రోడ్లపైకి జనం వస్తుండటంతో బిజినెస్ లు బాగానే సాగుతున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఓపెన్ అవుతున్నాయి. అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటున్నాయి.

ఓన్ వెహికల్ కే ప్రయారిటీ

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్​ లేక జనాల్లో ఓన్ వెహికల్స్ యూసేజ్ పెరిగింది. కరోనా భయంతో ఆటోలు, క్యాబ్ ల్లో తిరిగేందుకు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం లేదు. సొంత వెహికల్స్ తోనే రోడ్లపైకి వస్తుండడంతో రద్దీ పెరిగింది. లేనివారు కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుంచి కార్ల వాడకం ఎక్కువైంది.

ప్రికాషన్స్ తీసుకుంటలేరు

సిటీ రోడ్లు, బిజినెస్ ఏరియాల్లో రద్దీ పెరుగుతుండగా జనం మాత్రం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. చాలామంది మాస్క్​లు పెట్టుకోవడం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ మాట మర్చిపోతున్ నారు. పెద్ద మార్కెట్ల నుంచి కాలనీల్లో దుకాణాల వరకూ పరిస్థితి ఇలాగే ఉంది. టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, వైన్స్ లాంటి చోట్ల జనం గుమిగుడుతున్నారు. వెహికల్స్ పై తిరిగేప్పుడు మాస్క్ లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తున్నా పెద్దగా మార్పు కనబడటం లేదు.

 

 

Latest Updates