రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

హైదరాబాద్ :  కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై కూకట్ పల్లి కోర్టు మంగళవారం విచారణ ముగిసింది. రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని వాదనలు వినిపించారు రేవంత్ తరఫు లాయర్. పాత కేసుల్లో రేవంత్ పై పీటీ వారెంట్ హైదరాబాద్ పోలీస్ అడిగారని కోర్ట్ కు తెలిపారు పోలీస్ తరఫు అడ్వకేట్.

తమ క్లయింట్ రేవంత్ కు తెలియకుండా ఎలాంటి ముందస్తు నోటీస్ లు లేకుండా కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు రేవంత్ న్యాయవాది. అదే సాకుతో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారని బెయిల్ మంజూరు చెయ్యాలని వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ హై కోర్ట్ శ్రీనివాస్. ఇరు పక్షాల వాదనలు విన్న 8వ మేజిస్ట్రేట్ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాది ఈ నెల 6న కూకట్ పల్లి కోర్టులో ఆయన బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన  కోర్టు.. తీర్పు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెేటీఆర్‌ ఫాంహౌస్‌ పై డ్రోన్‌ ఎగురవేసిన కారణంగా రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Latest Updates