రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ: దందాలు చేసుకునేటోళ్లకే టీఆర్ఎస్ టికెట్లు

ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు దక్కించుకున్నదెవరు? టికెట్లు దక్కనివారెవరు..కేసీ ఆర్ చేస్తున్న జకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉద్యమంలో పాల్గొ ని,పార్టీకి అండగా నిలబడిన వ్యక్తు లకు టిక్కెట్ నిరాకరించి, ధనవంతులకు, దందాలు చేసుకు నేటోళ్లకు , ఉద్యమంతో కానీ, పార్టీతో సంబంధంలేని వ్యక్తు లకు టిక్కెట్ టవ్వడాన్ని ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి. రెండు తరాలు ప్రజా సేవకు అంకితమైన కాకా కుటుం బానికి జరిగిన ద్రోహం వాస్తవం కాదా? తెలంగాణలోని ప్రస్తుత రాజకీయపరిణామాలపై కాంగ్రెస్ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ‘వెలుగు’తో మాట్లా డారు.

ప్రశ్న: గ్యా ప్ తర్వాత ఎన్ని కలకల హడావుడిలోఉన్నారు. ప్రచారం ఎలా నడుస్తోం ది?

రేవంత్: స్పం దన బాగా వస్తోంది. రాష్ట్రంలోరాజకీయ పరిణామాలను ప్రజలకు తెలిసేలా చెబుతున్నాం. ఇవి ప్రధానిని నిర్ణయించే ఎన్ని కలు.ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం పరిమితంగా ఉంటుం ది. ప్రధానంగా ఎన్డీయే, యూపీయే కూటమి మధ్యనే పోటీ నెలకొని ఉంది.

ప్రశ్న: అసెం బ్లీ ఎలక్షన్స్ జరిగి మూణ్నెళ్లు కాలేదు. రిజల్ట్ చూశాం . ఈ పరిస్థితిలో కాంగ్రెస్ మాటలను ప్రజలు వింటారా ?

రేవంత్: మా ఎమ్మెల్సీలను తీసుకు ని మండలిలో కాంగ్రెస్ ను విలీనం చేసే ప్రయత్నం కేసీ ఆర్ చేశారు. కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా గెలిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, నల్గొం డ జిల్లా ల నుంచి దాదాపు 40 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి చోట టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు​రా కుండా నాలుగో స్థానానికి పరిమితమైంది. అదే లోక్‌‌సభ ఎన్నికల్లోనూ పునరావృత్తమవుతుంది.

ప్రశ్న: కానీ అక్కడ టీఆర్ఎస్ పోటీకి నిలబడలేదని చెబుతోంది కదా?

రేవంత్: పాతూరి సుధాకర్, పూల రవీందర్ పార్టీ తరఫున పనిచేసిన వాళ్లే. ఓడిపోయాక పార్టీ కాదంటే నడుస్తదా? టీఆర్ఎస్ తో ఉన్నందుకే పాతూరిని ప్రజలు శిక్షించారు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత చంద్ర శేఖర్, కవిత, కేటీఆర్ ను కలిసి న మాట వాస్తవం కాదా? మా పార్టీ వారేనని ప్రకటించుకున్న విషయం అప్పుడే మరిచిపోయారా?

ప్రశ్న: శాసనమండలి ఫలితాలు వచ్చినా వలసవెళ్తున్నారు కదా?

రేవంత్: నాయకులు పార్టీ మారడానికి ఎన్నోకారణాలు ఉంటా యి. కడుపు నిం డా తిండి పెట్టినా, పక్కవాడి తిండి ని లాగేసుకోవడం కరెక్టు కాదు కదా? ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా సీఎం ప్రవర్తిస్తున్నప్పుడు సరిదిద్దా ల్సిన బాధ్యత ప్రజలదే.

ప్రశ్న: ఇతర పార్టీల్లో నా యకత్వ లోపం,పార్టీలకి మనుగడ లేకనే తమ పార్టీలోకి వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు?

రేవంత్: మారిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసమే మారుతున్నట్టు స్టేట్ మెంట్ ఇప్పిస్తే సరిపోతుందా? అవసరానికి తగినట్లుగా అబద్ధాలు చెప్పే గొప్ప వ్యక్తి సీఎం.

ప్రశ్న: ఎమ్మెల్యేలను పార్టీ మారకుం డా కాంగ్రెస్ ఆపలేకపోతుం దా? విశ్వాసం లేకనే పోతున్నారా?

రేవంత్: భయం, అవసరం ఇతర కారణాలు చాలా ఉంటా యి. పార్టీ మీద నమ్మకం లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫాం తీసుకు ని ఎందుకు పోటీచేస్తారు. ప్రజల తీర్పును కేసీ ఆర్ కు అమ్ముకోవడం తప్పు.

ప్రశ్న: పార్టీలలో పోటీ చేసేవాళ్లులేకనే టిక్కెట్​ఇచ్చారని ఆ పార్టీ చెబుతుంది?

రేవంత్: కాంగ్రెస్‌‌ టిక్కెట్లను దారినపోయే దానయ్యలకు ఇవ్వలేదు. తెలంగాణకు, ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేని వ్యక్తు లకు టిక్కెట్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయే.

ప్రశ్న: టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని కేసీఆర్​చెబుతున్నారు.

రేవంత్: 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ అమ్ముకున్ నాడని పార్టీ కార్యకర్తలే చితకబాదిన విషయాన్ని ఆయన మరిచిపోయినా ప్రజలకు ఆ విషయం తెలుసు. నాన్ గెజిట్ఉద్యోగుల తరపున పోలీసుల దాడుల్లో గాయపడిన స్వామిగౌడ్ కు టికెట్ ఇవ్వకుండా తిరస్కరించి రంజిత్ రెడ్డికి ఇచ్చాడు . ఆయనకున్న అర్హత ఏమిటి? స్వామి గౌడ్ కు లేని అర్హత ఏంటో ప్రజలకు చెప్పాలి.

ప్రశ్న:17 సీట్లలో కాం గ్రెస్ కు అభ్యర్థులు లేరని,ప్రధానిని నిర్ణయిం చేది మేమేననిచెప్పుకుంటున్నారు?

రేవంత్: పెద్దపల్లి, ఖమ్మం నుంచి బరిలో ఉన్ననేతకాని వెంకటేష్ , నామా నాగేశ్వర్ రావు లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వ్యక్తు లే కదా? వాళ్లకు ఎందుకు టికెట్ ఇచ్చారు? చెల్లని రూపాయంటూ మాట్లా డిన కేటీఆర్ దీనిపై ఏం సమాధానం చెబుతారు.ఆయన పార్టీలో నేతలే లేరా?

ప్రశ్న: రాష్ట్ర ప్రయోజనాల కోసమే మద్దతుఇచ్చామన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్నారు కదా?

రేవంత్: కేసీ ఆర్ నాటకాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. నువ్వు గెలిచి ఎవరికి మద్దతు ఇస్తావోఅందరికీ తెలిసిందే. పూజలు, యజ్ఞా లు చేస్తావు కదా యాదాద్రి గుళ్లో దేవుడి మీద కేసీ ఆర్ ప్రమాణం చేసి చెప్పగలడా? తన మద్దతు ఎవరికీ ఉండదని. తానే ప్రధాని బరిలో ఉంటానని టీఆర్ఎస్ వాళ్లే? మీరు గెలుస్తారా ?

రేవంత్: సమయం, సందర్భానుసారమే ఓటర్లునిర్ణయం తీసుకుంటా రు. ఈసారి నా గెలుపుఖాయం .

ప్రశ్న: కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా ఉన్నారా?

రేవంత్: ఉన్నారు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లోకాంగ్రెస్ ను గెలిపిం చారు. దీంతో తెలంగాణసమాజంలో ఏదో మార్పు వస్తుందని కేసీ ఆర్ ఉలిక్కి పడ్డారు. ఇక 16 ఎంపీలూ ఓడితే సచివాలయంలో కూర్చు నే రోజు కూడా వస్తుంది.

ప్రశ్న: ఆర్మూర్ రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి?

రేవంత్: కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ కాదా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పాత్ర లేకుండా ఏ ఉద్యమం ముందుకు రావడం లేదు. ఉత్తమ్ కుమార్ , రేవంత్ రెడ్డో అవసరం లేదు. ఎక్కడి క్కడ కాంగ్రెస్ నిలబడి ఉద్యమిస్తుంది. నేరే ళ్ల దళితులు కావచ్చు. ఖమ్మం రైతుల ఘటన కావచ్చు. మల్లన్న సాగర్ ముంపు బాధితులే కావచ్చు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించి పోరాడిన అంశాలే.

ప్రశ్న: తెలంగాణ బిడ్డ ప్రధాని కావద్దా అని కవిత, కేటీఆర్ అంటున్నారు?

రేవంత్: టీఆర్ఎస్ పుట్టక ముందేతెలంగాణ వ్యక్తిని ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టిన విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి.16 సీట్లు గెలిస్తే ప్రధాని అయితే, 40 సీట్లున్న మమతా బెనర్జీ ఏంకావాలి. అఖిలేష్ యాదవ్, యావతి, డీఎంకే స్టాలి న్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలు ఏం కావాలి . మమతా బెనర్జీని కలిసి వచ్చావు. తెల్లా రే సీబీఐ వాళ్లు ఆమె ఇంటికిపోతే.. కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు.

ప్రశ్న: జోష్ తో కాం గ్రెస్‌‌లోకి వచ్చిన మీరు ఇప్పుడు డి సప్పాయిం ట్‌ అవుతున్నారా?

రేవంత్: ఎందుకు. కాంగ్రెస్‌‌లో పదవి ఉందా లేదా పక్కన పెట్టండి . మల్కాజిగిరిలో నా ప్రచారం చేస్తే జోష్ తగ్గిందో లేదో తెలుస్తుంది. ఇవాళ ప్రతిపక్షాన్ని చూపించే సంస్కృతి మీడియాలో పోయింది. సీఎం, సీఎం పీఆర్వోలు డైరెక్షన్లలో మీడియా నడుస్తోంది. కనీసం ఆరువేల మంది రాని ఎల్బీ స్టేడియం సభ ఎంత పెద్ద వార్త. కేసీ ఆర్ ఇప్పటివరకు పెట్టిన సభలలో అత్యంత వైఫల్యం అదే. అయినా ఆ వార్తాను ఎన్ని పత్రికలు రాశాయి.

Latest Updates