కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్

టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గత ఐదేళ్ల పాలనలో కీలక సంస్థలు స్వతంత్రతను కోల్పోయాయని లేఖలో తెలిపారు. లోకాయుక్త, మానవ హక్కుల సంఘం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు అని అన్నారు. ఇప్పుడు విద్యుత్ రంగానికి చెందిన ఎలక్ట్రిక్ రెగ్యూలేటరీ కమిషన్(ఈఆర్ సీ) కూడా అదే జాబితాలో చేరబోతుందా? అనే సందేహాం వ్యక్తం చేశారు. ఈఆర్ సీలో పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. విద్యుత్ కొనుగోళ్ళు, ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని..తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. తన ఆరోపణలు నిజం కాకపోతే ప్రభుత్వం చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్.

Latest Updates