ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం సహజం: రేవంత్ రెడ్డి

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం సహజమన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గోపన్ పల్లి భూ ఆక్రమణల ఆరోపణలపై స్పందించిన రేవంత్… తనపై ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభం జరుగుతుందన్నారు. పనిచేయని ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తామని కేటీఆర్‌ చెబుతున్నారన్న రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌, కేటీఆర్‌లు కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Latest Updates