రూల్స్ కు విరుద్దంగా భారీ భవనాలు: NGT చెన్నైలో రేవంత్ పిటిషన్

పుప్పాల గూడ లో నాలాను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని NGT చెన్నైలో పిటిషన్ దాఖలు చేశారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. GO 111 సహా బిల్డింగ్ రూల్స్ 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని NGT దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, రాజకీయ బలం ఉన్న బడా సంస్థలు డిఎల్ఎఫ్, మైహోంమ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని పిటిషన్ లో తెలిపారు.

పిటిషన్ విన్న జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహా డిఎల్ఎఫ్, మైహోమ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది NGT. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజినల్ ఆఫీసర్,  చెరువుల పరిరక్షణ కమిటీలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Latest Updates