కేసీఆర్, మోడీలను ప్రశ్నించినందుకే ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాజకీయంగా సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలను ప్రశ్నించినందుకు తనపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈడీ తనను ఎన్నికల ముందు విచారణకు పిలిచిందని అన్నారు. హైదరబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లో ఏసీబీ పెట్టిన కేసును ఈడీ మళ్లీ దర్యాప్తు చేస్తోందని, అగిన ప్రశ్నలే అడి వేధిస్తోందని అన్నారు.

నన్నో.. చంద్రబాబునో ఇరికించాలనే: రేవంత్

కేసీఆర్ అక్రమాలను ఎండగడుతున్నానని, మోడీతో కలిసి ఇద్దరి స్వలాభం కోసం ఈడీని ఉసిగొల్పతున్నారని రేవంత్ అన్నారు. తనను లేదా ఏపీ సీఎం చంద్రబాబును అక్రమంగా కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన భుజంపై తుపాకీ పెట్టి బాబును కాల్చాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు ఎదురైనా కేసీఆర్ పై పోరాటం ఆపేదిలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలని మెప్పించి గెలవాలి కానీ ప్రతిపక్షాల్ని ఇబ్బంది పెట్టి కాదని రేవంత్ అన్నారు.

Latest Updates