సచివాలయానికి కేసీఆర్ ను గుంజుకు రావాలె

తెలంగాణ సమాజం కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు . ఎల్బీబీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ డ్డినగర్ మీదుగా శుక్రవారం రోడ్డుషో నిర్వహించారు. ముందుగా హయత్ నగర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వనస్థలిపురం, హస్తినాపురం,బీఎన్ రెడ్డి మీదుగా కర్మన్ ఘాట్ నుంచి చంపాపేట లోని గాంధీ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడని పేదవారి తరఫున నేను పోట్లాడుతుంటే నాపై 65 కేసులు పెట్టించి జైలుకి పంపాడని అన్నారు .టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. పేదల కష్టం తెలియనివాడు మంత్రి మల్లారెడ్డి అల్లుడని చెప్పుకుంటూ వస్తున్నాడని తగిన బుద్ధి చెప్పాలని అన్నారు . తెలంగాణ సమాజం కోసం తల తెగిపడేవరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతు వస్తుందని చెప్పారు. టీఆర్‍ఎస్ పార్టీ16 ఎంపీ అభ్యర్థులని ఓడిస్తే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి సచివాలయంలోకి వచ్చి కూర్చుంటాడని రేవంత్‍ అన్నారు . అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ హాజరయ్యారు.

Latest Updates