కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారు..ఆధారాలివే..

జన్వాడ ఫామ్ హౌజ్  నిర్మాణంలో మంత్రి కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  ఆ స్థలంతో తనకు సబంధం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు. కానీ ఆ స్థలంను కేటీఆర్ లీజుకు తీసుకున్నారని టీఆర్ఎస్ నేతలే చెప్పారని గుర్తు చేశారు. తన బెయిల్ రద్దు చేయాలని కేటీఆర్ కోర్టును కోరారన్నారు. లక్ష చదరపు అడుగుల్లో ఫాం హౌస్ కట్టుకున్నారన్నారు. 301 సర్వే నంబర్ లో కేటీఆర్ భార్య పేరున భూమి ఉందన్నారు. అర్బన్ అవెంచర్స్ లో భూమి ఉందని ఎన్నికల అఫిడవిట్ లో కూడా కేటీఆర్ చెప్పారన్నారు. 301-313 సర్వే నంబర్లో 25 ఎకరాల భూమి ఉందన్నారు. 645 సర్వే నంబర్ లోని భూములు వేరు 301 నంబర్ లోని భూములు వేరన్నారు. కేటీఆర్ కు జన్వాడలో ఆస్తులున్నాయని పోలీసులు కూడా చెప్పారన్నారు. తన భూమిలో అక్రమ నిర్మాణాలు చూపిస్తే తానే గడ్డపారతో కూల్చేస్తానన్నారు రేవంత్.

see more news

సభలో కన్నీరు పెట్టుకున్నస్పీకర్ పోచారం

భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు

Latest Updates