మా పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గాడు : రేవంత్

revanth-reddy-comments-on-new-secretariat-at-bison-polo-ground

హైదరాబాద్, వెలుగు: ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన బైసన్ పోలో గ్రౌండ్ ను కాంక్రీట్ జంగిల్​గా మార్చి సెక్రటేరియట్ కట్టాలని సీఎం కేసీఆర్ అనుకున్నాడని, తమ పోరాటం వల్ల అది జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న పార్టీలో 23 మందే గెలిచినట్లు.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్​కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందే మిగులుతారని చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో కేసీఆర్ కు టుంబం ఓడిపోయిందని, ప్రజలు గెలిచారని అన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన చేస్తున్నారన్నారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెల్చిన సందర్భంగా సోమవారం కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.

Latest Updates