సంపత్ పవన్ తో ఫోటో దిగకపోతే నాదా బాధ్యత:రేవంత్

కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కు ఎంపీ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంపత్  పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగకపోతే తనదా? బాధ్యత  అని అన్నారు. సంపత్ కు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కదా? ఇక్కడ పనేంటని ప్రశ్నించారు. సంపత్ కు వంశీకి మైక్ ఇవ్వక పోతే తనది బాధ్యత కాదన్నారు రేవంత్. వంశీ ,సంపత్ అందరికి కంటే ముందు అఖిలపక్షం మీటింగ్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారని..దీనిపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ లో పదవులు ఎప్పుడొస్తాయో..ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదన్నారు. యురేనియం తవ్వకాలు జరుపుతామంటే ఊరుకునేది లేదన్నారు.  సీఎం కేసీఆర్ కు వ్యతిరేక పోరాటంలో అందరూ సోదరులేనన్నారు. అవినీతి కేసులో కేసీఆర్ ను లోపలేస్తే ఆటమొదలవుతుందన్నారు. బడ్జెట్ సమావేశాలు 14 రోజులు లేకపోతే చట్టపరమైన పవిత్రత ఉండదన్నారు.