పోతిరెడ్డిపాడు పై కేసీఆర్ చెప్పే మాటల్లో ఒక్కటీ నిజం లేదు

పోతిరెడ్డి పాడు విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీరు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆ నీటి విషయంపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు వైఎస్ ను విభేదిస్తే .. కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై అన్నిసార్లు స్పందించానన్న కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని అన్నారు. అదే నిజమైతే 11వేల 500క్యూసెక్కుల గండి కేసీఆర్ ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

Latest Updates