రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయని… లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కలెక్టర్ల సమావేశంలో కనీసం ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై సీఎం చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు సమన్వయ సమితిలు ఫెయిలయ్యాయన్నారు. రైతు సమన్వయ సమితిలు TRS  నేతలకు పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా… బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest Updates