కేసీఆర్ ‘సెల్ఫ్ డిస్మిస్’ అనడం వల్లే RTC డ్రైవర్ ఆత్మాహుతి : రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడని అన్నారు మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఇది ప్రభుత్వ హత్య అనీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిన హత్యగా భావిస్తున్నామని చెప్పారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ.. సీఎం, మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం వల్లే ఉద్యోగులు , కార్మికుల్లో అభద్రత పెరిగిపోయిందన్నారు. DRDO అపోలో హాస్పిటల్ కు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మందకృష్ణ మాదిగ ఇతర నేతలు వెళ్లి మీడియాతో మాట్లాడారు.

19నాడు జరగబోయే రాష్ట్ర బంద్ లో విద్యార్థులు, రెవెన్యూ, సింగరేణి, ఎమ్మార్పీఎస్ యువత, కులసంఘాలు, ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ స్టూడెంట్ సంఘాలు అన్నీ.. అందరూ పాల్గొనాలని కోరారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చాలని కోరారు. కేసీఆర్ నియంత పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం నిలబడిందని నిరూపించాలని కోరారు.

Latest Updates