మూవీస్, వంట: లాక్ డౌన్ లో నాటైమ్ పాస్ ఇదే

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ టైంను మన పొలిటికల్ లీడర్లు ఎలా గడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది వీ6- వెలుగు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని వీడియో కాల్ ద్వారా పలకరించింది. ‘‘29 ఏండ్లలో ఫ్యామిలీతో ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే ఫస్ట్ టైం. ఫారిన్ టూర్ల‌కు వెళ్లిన‌పుడు తప్ప ఇంత టైం వారితో ఎప్పుడూ లేను. ఇలాగే అలవాటైతే తర్వాత బయటకెళ్లాలంటే విసుగొస్తదని భయంగా ఉంది. గంటకోసారి టీ అడగటంతో ఇంట్లోవాళ్లు విసుక్కుంటున్నరు. నేను బయటకుపోతే బాగుండని అనుకుంటున్నరు’’అని రేవంత్ చెప్పారు. ‘‘జైల్లో ఉన్నప్పడు ఫ్యామిలీకి దూరమయ్యా. కరోనావల్ల ఫ్రీడంకు దూరంగా ఉన్నా. చుట్టాలు, దోస్తులు, మీడియా వాళ్ల‌తో ఫోన్ల మాట్లాడుతున్న.

బిడ్డ, అల్లుడితో కలిసి రోజుకు రెండు సినిమాలు చూస్తున్నా. నాకు అవగాహన లేని విషయాలు, దేశ ఆర్థిక‌ పరిస్థితి, వివిధ రంగాలను ఆదుకోవటానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై పుస్తకాలు చదివి తెలుసుకుంటన్నా. చదువుకునేటప్పుడు వంట చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఖాళీగా ఉన్నవ్ కదా వంట చేయమంటున్నరు. నేను వండిన చికెన్ తిన్నవాళ్లు బాగుందంటున్నరు. జైలులో 15 రోజులు డిటెన్షన్ సెల్ లో ఉన్నా. అప్పుడే నాకు లాక్ డౌన్ ప్రాక్టీస్ అయింది. కరోనా, లాక్ డౌన్ గురించి ఇంట్లో చర్చించటంలేదు. ఎవరు ఏం చేసినా ప్రకృతి సరి చేస్తుంది. ఇప్పుడు మనుషులు ఇంట్లో ఉంటే పశువులు, ఇతర జీవాలు ప్రశాంతంగా ఉన్నాయి. కరోనా వల్ల పేదలు, డబ్బున్న వాళ్ల‌న్న‌ తేడా ఇప్పుడు ఏం లేదు’’అని ఆయన అన్నారు.

Latest Updates