రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: కేటీఆర్

దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో గ‌తంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయ‌న దుబ్బాక ఎన్నిక‌ల‌పై ప‌లు విష‌యాలు మాట్లాడారు.  కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదన్నారు. రేవంత్‌ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపోమాపో బీజేపీలోకి పోతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే పార్టీలు మారతారని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదన్నారు మంత్రి కేటీఆర్.

Latest Updates