ప్రతిరోజు 40, 50 కోవిడ్ మరణాలను రాష్ట్ర ప్రభుత్వం దాస్తోంది

ప్ర‌త్యేక కోవిడ్ ఆస్పత్రిగా ప్రారంభించిన గ‌చ్చిబౌలి టిమ్స్ లో ఎలాంటి సదుపాయాలు లేవ‌న్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి . అక్క‌డ‌ చెత్త‌, న‌లుగురు సెక్యూరిటీ, ఓ కుక్క త‌ప్పా ఇంకెవ‌రూ లేరని అన్నారు. ప్ర‌భుత్వం చెప్పిన 100 మంది డాక్ట‌ర్లు, ప్ర‌పంచ అత్యాధునిక వైద్యం ఎక్కడుందని, కేసీఆర్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌న‌టానికి టిమ్స్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 50వేల టెస్టులు కూడా చేయ‌లేదని, మ‌ర‌ణాల రేటులో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారన్నారు. అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ ఉంటే తెలంగాణ మాత్రం దేశంలో 22వ స్థానంలో ఉందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఉన్న నిధులు- విరాళాలు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు రేవంత్. ప్ర‌తి రోజు బయ‌ట‌కు చెప్ప‌కుండా 40, 50 మ‌ర‌ణాల‌ను దాస్తున్నారని, వెంట‌నే టిమ్స్ ప్రారంభం అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest Updates